

కొద్ది రోజులు క్రితమే ప్రకటించిన థలైవర్ 173 నుంచి దర్శకుడు సుందర్ సి తప్పుకోవడంతో తమిళ సినీ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరిని ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ కలిపే చిత్రంగా భారీ హైప్ తీసుకున్న ఈ ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఆకస్మిక కారణాల వల్ల తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు సుందర్ సి వెల్లడించారు. అంతకంటే పెద్ద షాక్ ఏంటంటే, రజినీకాంత్ ఇంకా కథ పట్ల పూర్తిగా నమ్మకం కలగలేదని, స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదని కమల్ హాసన్ స్వయంగా వెల్లడించడం.
ఇంకా ఆశ్చర్యకర విషయమేంటంటే, రజినీకాంత్–కమల్ హాసన్ ద్వయాన్ని నాలుగు దశాబ్దాల తర్వాత ఒకే సినిమాలో చూపించనున్న మరో అంబిషస్ ప్రాజెక్ట్‌కు కూడా ఇప్పటికీ సరైన కథ కోసం ఇద్దరూ స్క్రిప్టులు వింటున్నట్లు కమల్ తెలిపారు. కొన్ని నెలల క్రితమే ఇద్దరూ కలిసి నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అభిమానులను అయోమయంలో పడేశాయి. స్క్రిప్ట్ ఫైనల్ కాకుండానే ఈ రెండు ప్రాజెక్ట్‌లను ప్రకటించడం ఎందుకని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం థలైవర్ 173 కు సరైన దర్శకుడి అన్వేషణ కొనసాగుతుందని కమల్ హాసన్ స్పష్టం చేశారు. అయితే రజినీ–కమల్ మల్టీస్టారర్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా స్పష్టత లేదు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!