

అగ్ర కథానాయకుడు ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’, హను రాఘవపూడి రూపొందిస్తున్న ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ‘స్పిరిట్’లో కీలక పాత్ర పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ, తీవ్రమైన ఎండలను కూడా లెక్క చేయకుండా ప్రభాస్ ఎంతో కష్టపడి పని చేస్తున్నారని తెలిపారు. సెట్స్‌లో ఆయన మౌనంగా తన పని చేసుకుంటూ అందరితో కలిసిపోతారని చెప్పారు.
అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ప్రభాస్‌లో ఎలాంటి గర్వం ఉండదని వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు. అందరితో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారని, షూటింగ్ లొకేషన్లకు రుచికరమైన వంటకాలు తీసుకువచ్చి అందరితో పంచుకుంటారని వెల్లడించారు. మరోవైపు ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్‌లను ఒకేసారి పూర్తి చేయడానికి ప్రభాస్ తన డేట్స్‌ను జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. రెండు భిన్నమైన పాత్రల కోసం లుక్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!