

దర్శకుడు మెహర్ రమేశ్ మాట్లాడుతూ.. విశాఖపట్నం త్వరలోనే సినిమా రాజధానిగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. విశాఖలో మరిన్ని సినిమా షూటింగ్‌లు జరిగేలా కృషి చేస్తున్నామని, నగరాన్ని గూగుల్, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు.
ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధితో పాటు సినీ రంగంలోనూ విశాఖను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. డబ్బింగ్ థియేటర్ల అభివృద్ధి, జాతీయ స్థాయి లేదా నంది అవార్డుల కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. త్వరలో సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో షూటింగ్‌లను ప్రోత్సహించడంతో పాటు నిలిచిపోయిన సబ్సిడీలను విడుదల చేస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాలే సినీ పరిశ్రమకు ప్రధాన ఆధారమని, కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!