

మాజీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వైసీపీ అంతర్గత వ్యవహారాలపై సంచలన ఆరోపణలు చేస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు. తనను ‘నమ్మకద్రోహి’గా చిత్రీకరిస్తూ వైసీపీకి చెందిన ఓ వర్గం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తాను వైఎస్ జగన్‌కు ఎప్పుడూ నమ్మకద్రోహం చేయలేదని, ఆయనకు నమ్మకస్తుడిననే కారణంతోనే అనేక కేసుల్లో తనను నిందితుడిగా చేర్చారని పేర్కొన్నారు. 2020 తర్వాత పార్టీలో తనపై కుట్రలు, అవమానాలు పెరిగాయని, ఉత్తరాంధ్ర బాధ్యతలతో పాటు కోర్ కమిటీ నుంచి కూడా తనను తప్పించారని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. మంత్రులు సైతం జగన్‌ను కలవకుండా అడ్డుకున్నది సజ్జలేనని, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆయన ఆధ్వర్యంలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. తాను వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బహిరంగ లేఖతో వైసీపీ అంతర్గత వ్యవహారాలపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ‘ఆట మొదలైంది’ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!