

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తన కొత్త హాట్ 70 ప్రో 5జీని సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో విడుదల చేయనుంది. ఈ ఫోన్ విక్రయాలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరగనున్నాయి. డైవ్ బ్లూ, మిరాజ్ గ్రీన్, సిల్క్ గ్లో పర్పుల్, థెర్మో ఆరంజ్ రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది. థెర్మో ఆరంజ్ వేరియంట్ ఉష్ణోగ్రతకు అనుగుణంగా రంగు మార్చుకోవడం, మిరాజ్ గ్రీన్ తక్కువ వెలుతురులో రూపాన్ని మార్చుకోవడం దీని ప్రత్యేకతలు.
ఫోన్‌లో 6.76 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 7.85 మి.మీ. స్లిమ్ బాడీ ఉన్నాయి. వెనుక భాగంలో నోటిఫికేషన్లు, విజువల్ ఎఫెక్ట్స్ చూపించే కస్టమైజ్ చేసుకునే యాక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్ (ఏఎంసీ) ఇవ్వనున్నారు. గ్లోబల్ వేరియంట్ ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్, 50MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 5,600mAh లేదా 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండొచ్చు. అయితే భారత వేరియంట్ పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!