
సినిమాలు

దళపతి విజయ్ నటించిన జన నాయగన్ చిత్రానికి సంబంధించి సెన్సార్ వివాదంపై సుప్రీంకోర్టులో నిర్మాతలకు నిరాశ ఎదురైంది. ఈ విషయంలో నేరుగా జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించి, తదుపరి చర్యల కోసం మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని చిత్ర నిర్మాతలను ఆదేశించింది.
అదే సమయంలో, ఈ వ్యవహారంపై ఈ నెల 20 వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి A సర్టిఫికేట్ మాత్రమే ఇస్తామని స్పష్టం చేయడంతో వివాదం తలెత్తగా, దీనిపై న్యాయపరమైన పరిష్కారం కోసం చిత్ర బృందం కోర్టును ఆశ్రయించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!