

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ‘ఫస్ట్ ఎవర్ గోట్ ఫైట్ మూవీ’గా ప్రకటించిన తమిళ చిత్రం ‘జాకీ’ టీజర్‌ను విడుదల చేశారు. PK7 స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా మధురై గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. చెన్నైలో జరిగిన వీధి తిరువిళా 13వ ఎడిషన్ కార్యక్రమంలో ఈ టీజర్‌ను ఆవిష్కరించారు.
2021 లో విడుదలైన ‘మడ్డి’ సినిమా తర్వాత మరోసారి దర్శకుడు డా. ప్రగభల్తో కలిసి PK7 స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రేమ్ కృష్ణదాస్, సి. దేవదాస్ & జయ దేవదాస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యువన్ కృష్ణ, రిదాన్ కృష్ణాస్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించగా, శక్తి బాలాజీ సంగీతం అందించారు.
‘జాకీ’ కథ గ్రామాల్లో జరిగే సంప్రదాయ పొట్టేలు పోరాటం చుట్టూ సాగుతుంది. ఈ పోరాట సన్నివేశాలను పూర్తిగా సహజంగా చిత్రీకరించడానికి చిత్ర బృందం మూడు సంవత్సరాల పాటు మధురై ప్రాంతంలో కృషి చేసింది. నటీనటులు నిజమైన పొట్టేళ్లతో శిక్షణ తీసుకుని నటించారు. ఈ చిత్రం ద్వారా గ్రామీణ జీవితం, సంప్రదాయ క్రీడ, ప్రజల భావోద్వేగాలను సహజంగా ప్రేక్షకులకు అందించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!