
క్రీడలు

విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబలి’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. రాయలసీమ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ వేగంగా కొనసాగుతున్న సమయంలో విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో పలు తప్పుడు ప్రచారాలు వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీమ్ అధికారికంగా స్పందించింది. నిర్మాతలపై భారం పెరిగేలా విజయ్ 50 నుంచి 60 మంది అసిస్టెంట్లు, అనేక క్యారవాన్లు డిమాండ్ చేశారనే వార్తలను పూర్తిగా ఖండించింది. విజయ్ ఎప్పుడూ నిర్మాతల ప్రయోజనాలనే కోరే హీరో అని స్పష్టం చేసింది. సంస్థల పేర్లు, లోగోలను దుర్వినియోగం చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీమ్ కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!