కథానాయకుడు విజయ్ దేవరకొండ ఇటీవల రష్మికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత నెల రోజులుగా పెళ్లి కార్యక్రమాలతో బిజీగా గడిపిన ఆయన, ఇప్పుడు మళ్లీ సినిమా షూటింగ్లకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘రణబాలి’ షూటింగ్లో పాల్గొనబోతున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ వారం నుంచి కర్నూల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ నెల 12న విజయ్ దేవరకొండ షూటింగ్ సెట్లో చేరనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో ఆయనతో పాటు ప్రధాన తారాగణంపై టాకీ పార్ట్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈ సినిమా రూపొందుతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ ఒక యోధుడి పాత్రలో కనిపించనుండగా, ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక నటిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు సంగీతం అజయ్–అతుల్ అందించగా, ఛాయాగ్రహణాన్ని నీరవ్ షా నిర్వహిస్తున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!