
క్రీడలు

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పులతో వదిలి వెళ్లిందని, అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మంగయ్య బంజర గ్రామంలో రూ.45 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, లో-లెవల్ కాజ్‌వేను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మొదటి దశలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, రెండో దశలో 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేసి మొత్తం 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌కు ప్రత్యేకంగా లక్ష ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, రాబోయే దశల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!