
క్రీడలు

వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న మల్టీస్టారర్ సినిమా టాలీవుడ్లో భారీ ఆసక్తిని రేపుతోంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో కామెడీ, యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో కథను రూపొందిస్తున్నారని సమాచారం. ఇద్దరు హీరోల భిన్నమైన పాత్రలతో సినిమా మరింత వినోదాత్మకంగా ఉండనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
జులై నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని, డిసెంబర్ నాటికి వరుస షెడ్యూళ్లతో పూర్తి చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం 2027 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది జీవీ ప్రకాష్ కుమార్ కావడం హైలైట్‌గా మారింది. అనిల్ రావిపూడి ప్రత్యేక కామెడీ ట్రీట్మెంట్తో ఈ మల్టీస్టారర్ సంక్రాంతి రేసులో బలమైన పోటీ ఇవ్వనుందని అంచనా.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!