
సినిమాలు

మహేశ్‌బాబు హీరోగా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్రబృందం.. తాజాగా మహేశ్‌బాబు పాత్రకు సంబంధించిన మొత్తం షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం.
దీంతో ఈ ప్రాజెక్ట్‌లో మహేశ్‌బాబు షూటింగ్ దాదాపు పూర్తయినట్లుగా తెలుస్తోంది. మిగిలిన చిత్రీకరణను కూడా అక్టోబర్ తొలి వారంలోగా పూర్తి చేసేలా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఎస్.ఎస్. కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!