
గాసిప్స్

మిస్ శెట్టి – మిస్టర్ పొలిశెట్టి తర్వాత నటిస్తున్న నవీన్ పొలిశెట్టి తాజా చిత్రం అనగనగా ఒక రాజు. ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఫీమెల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కో - ప్రొడ్యూస్ చేస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
సినిమా ట్రైలర్ జనవరి 7, సాయంత్రం 6:04 గంటలకు విడుదల కానుంది అని మేకర్స్ ప్రకటించారు. అనగనగా ఒక రాజు జనవరి 14, 2026 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. పోస్టర్లో నవీన్ పొలిశెట్టి నల్లటి కళ్లజోడు వేసుకుని, ఊయలలో కూర్చోని, ఒక చేతిని పైకి పైసి, మరొక చేతిని తొడలపై పెట్టి ధీమాగా చూపిస్తున్నాడు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!