
జనరల్

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ నటించిన ‘గోదారి గట్టు పైనా’ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. కొత్త దర్శకుడు సుభాష్ చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గౌరవప్రదమైన వసూళ్ల దిశగా ముందుకెళ్తోంది. ‘మెమ్ ఫేమస్’ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
అయితే వరుసగా సినిమాలు చేయకుండా మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ వంటి నటులు కెరీర్ ప్రారంభ దశలో వరుస సినిమాలతో తమ మార్కెట్ పెంచుకున్నారని సినీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం సుమంత్ ప్రభాస్ నటనపై ఎక్కువ దృష్టి పెట్టి రెగ్యులర్గా సినిమాలు చేయాలని ఇండస్ట్రీ వర్గాలు సూచిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!