

నాచురల్ స్టార్ నాని హీరోగా, యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ కథానాయికగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ది ప్యారడైజ్. భారీ అంచనాల మధ్య ఈ సినిమా నేడు గ్రాండ్‌గా విడుదలైంది. సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించగా, రిలీజ్‌కు ముందు నుంచే కొన్ని సర్‌ప్రైజ్ క్యారెక్టర్స్ ఉంటాయనే టాక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
ఈ నేపథ్యంలో టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి ఊహించని పాత్రలో కనిపించడం ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి ప్రముఖ తెలంగాణ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్ అనంతరం ఈ పాత్రకు సంబంధించిన చర్చ మొదలైంది. మరోసారి విభిన్న పాత్రను ఎంచుకుని తనలోని నటనా వైవిధ్యాన్ని ప్రియదర్శి చూపించారని అభిమానులు, ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!