

లేడీ సూపర్ స్టార్ నయనతార మరో భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న నయనతార, ఇప్పుడు మరో పవర్ఫుల్ పాత్రతో బాలీవుడ్లో సందడి చేయనుంది.
ఈ సినిమాలో నయనతార పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా యాక్షన్ ప్రధానంగా ఉండబోతోందని సమాచారం. జవాన్ తరహాలోనే ఈ చిత్రంలో కూడా ఆమె స్టైలిష్ యాక్షన్ సీన్స్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఫైట్ మాస్టర్ల సమక్షంలో డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ స్టంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, కుల్దీప్ రాథోడ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!