

‘ఓ పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’, ‘రేపు ఉదయం పది గంటలకు’ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన చెందు ముద్దు, ‘థాంక్యూ సుబ్బారావు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ పతాకంపై దినేష్ కుర్ర నిర్మిస్తున్న ఈ చిత్రంలో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ను విడుదల చేసింది.
టీజర్‌ను పరిశీలిస్తే హాస్యం, యాక్షన్, ప్రేమ, ఉత్కంఠ, థ్రిల్ అంశాల సమ్మేళనంగా సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. మురళీధర్ గౌడ్ సంభాషణలు వినోదాన్ని పంచగా, కథానాయకుడు-కథానాయిక మధ్య సన్నివేశాలు, రైలులో కనిపించే యువతి చుట్టూ తిరిగే రహస్య అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!