

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ మంచి మనసుతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ తన ప్రేమ వివాహం జరగడంలో తారక్ కీలక పాత్ర పోషించారని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
స్వప్న దత్ మాట్లాడుతూ.. తాను ప్రసాద్ వర్మను ప్రేమిస్తున్న సమయంలో ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కాలేదని తెలిపారు. ఆ సమయంలో షూటింగ్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ను కలిసి మొత్తం విషయం చెప్పానన్నారు. ప్రేమ విషయాలను ఎక్కువకాలం దాచకుండా తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసుకోవడం మంచిదని తారక్ తనకు సలహా ఇచ్చారని చెప్పారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోరేమోనని భయపడగా, తానే మాట్లాడి ఒప్పిస్తానని చెప్పి అశ్విని దత్తో స్వయంగా మాట్లాడి పెళ్లికి అంగీకారం తీసుకువచ్చారని తెలిపారు. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్న దాంపత్య జీవితానికి ప్రధాన కారణం తారక్ అని స్వప్న దత్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!