

‘వీరభద్రుడు’ ప్రేక్షకులు థియేటర్లలో సంబరంగా చూసే పూర్తి స్థాయి మాస్ మసాలా వినోద చిత్రమని హీరో సూర్య తెలిపారు. ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన ఆయన, చిత్ర తొలి భాగం భావోద్వేగ న్యాయస్థాన కథనంగా సాగుతుందని, రెండో భాగం పూర్తిగా మాస్ హంగులు, వినోదం, యాక్షన్తో ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. ఆర్.జే. బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
హీరో కార్తి మాట్లాడుతూ, ఇలాంటి శక్తివంతమైన పాత్రను సూర్య మాత్రమే చేయగలరని అన్నారు. ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని చెప్పారు. దర్శకుడు ఆర్.జే. బాలాజీ మాట్లాడుతూ, సినిమాలో ఇంకా ఎన్నో ఆశ్చర్యకర అంశాలు ఉన్నాయని తెలిపారు. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రంలో సామాజిక అంశాలను దైవిక భావాలతో అద్భుతంగా మేళవించారని ప్రశంసించారు. ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!