

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘సీన్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ లభించింది. జీతు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.205 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హీరోగా సూర్య రికార్డు సృష్టించారు.
ఇప్పటికే ఈ ఏడాది విడుదలైన ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. తాజాగా ఈ జాబితాలో ‘సీన్’ కూడా చేరింది. ఈ చిత్రం ఐదో రోజు భారత బాక్సాఫీస్ వద్ద రూ.14.95 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో సూర్య పోలీస్ అధికారిగా కనిపించగా, నజ్రియా నజీమ్ కథానాయికగా నటించారు. నస్లెన్, ఆనందరాజ్, లాల్, గజరాజ్ కీలక పాత్రలు పోషించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!