

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి సురభి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నటన, గ్లామర్‌తో ఆకట్టుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోవడంతో క్రమంగా అవకాశాలు తగ్గాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది.
సురభి ఇప్పుడు వరుసగా రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లలో అవకాశాలు అందుకుని మళ్లీ వార్తల్లో నిలిచారు. నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు వేణు తెరకెక్కిస్తున్న, దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో కూడా ఆమె నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్రపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలు విజయవంతమైతే సురభి టాలీవుడ్‌లో మరోసారి బిజీ హీరోయిన్‌గా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!