

మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ సినిమా “వారణాసి”లో నటిస్తున్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు విరామం లేకుండా వరుసగా మూడు సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆయన తదుపరి సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రారంభమయ్యే అవకాశం ఉందని, అడ్వాన్స్ కూడా ఫైనల్ అయినట్టు చెబుతున్నారు.
అలాగే సుకుమార్ లేదా సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులతో పనిచేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగాతో “డెవిల్” అనే ప్రాజెక్ట్‌పై కూడా చర్చలు జరుగుతున్నట్టు టాక్. అంతేకాకుండా తన సొంత బ్యానర్‌పై ఒక కొత్త కథతో సినిమా తీయాలని మహేష్ ఆలోచిస్తున్నారని సమాచారం. ఇలా వరుస ప్రాజెక్టులతో అభిమానులకు ఎప్పటికప్పుడు వినోదం అందించాలని ఆయన భావిస్తున్నారు. ఈ లైనప్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!