

డీబీఎస్ బ్యాంక్ ఇండియా హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో కొత్తగా ట్రెజర్స్ వెల్త్ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది. సంపన్న వర్గాల ఖాతాదారుల పెట్టుబడులు, సంపద నిర్వహణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బ్రాంచ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ పెట్టుబడులను సమర్థంగా నిర్వహించుకోవాలనుకునే ఖాతాదారులకు ప్రత్యేక ఆర్థిక సేవలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం అందించడం ఈ బ్రాంచ్ ప్రధాన ఉద్దేశం.
ఈ బ్రాంచ్‌లో ట్రెజర్స్ రిలేషన్‌షిప్ మేనేజర్లు, వెల్త్ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఎన్‌ఆర్‌ఐ నిపుణులు ఖాతాదారులకు సేవలు అందించనున్నారు. సాధారణ బ్యాంకింగ్ సేవలతో పాటు పెట్టుబడులు, సంపద నిర్వహణకు సంబంధించిన వివిధ సేవలను ఒకే చోట పొందే అవకాశం కల్పించనుంది. హైదరాబాద్‌లో తన సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా సమగ్ర ఆర్థిక పరిష్కారాలను అందించడంలో భాగంగానే ఈ కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించినట్లు డీబీఎస్ బ్యాంక్ ఇండియా వెల్లడించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!