

‘శంబాల’ బ్లాక్‌బస్టర్ విజయానంతరం దర్శకుడు యుగంధర్ ముని, సందీప్ కిషన్‌తో కలిసి కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అడవిలో రాజులైన సింహం, తోడేలు మధ్య పోటీని సూచిస్తూ ఈ సినిమాలో సాహసభరితమైన కథ ఉండబోతుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇప్పుడు సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా మరో స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్లో బిడ్డ, ఖడ్గం, సింహం వంటి అంశాలు కనిపిస్తూ ఇది ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ అని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సింహంలాంటి యోధుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. “ఎ లెజెండ్ ఈజ్ బార్న్” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!