

కోలీవుడ్ యంగ్ నటి ఐశ్వర్య లక్ష్మి చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఆమె బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌ను ప్రశంసిస్తూ, “ఆమె ఒక మ్యాడ్ జీనియస్. తన మాట తీరు, ముఖ్యంగా పార్లమెంట్‌లో చేసే ప్రసంగాలు నాకు ఎంతో నచ్చుతాయి. నేను ఆమెకు పెద్ద అభిమానిని” అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో, నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.
ట్విట్టర్ వేదికగా కొందరు నెటిజన్లు ఐశ్వర్యపై నెగెటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే, మరోవైపు ఆమెకు మద్దతుగా నిలిచేవారు కూడా ఉన్నారు. ఒక నటిగా కంగనా ప్రతిభను మెచ్చుకోవడంలో తప్పులేదని వారు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత అభిప్రాయాలపై ఇలాంటి విమర్శలు చేయడం సరికాదని అంటున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి తెలుగులో ‘సంబరాల ఏటి గట్టు’, మలయాళంలో ‘ఆశ’ చిత్రాలతో బిజీగా ఉండగా, కంగనా రనౌత్ ‘భారత్ భాగ్య విధాత’, ‘క్వీన్ 2’ చిత్రాల్లో నటిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!