

‘విరూపాక్ష’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత దర్శకుడు కార్తీక్ దండు, నాగచైతన్యతో కలిసి ‘వృషకర్మ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్లో చూపించిన కథాంశం, విజువల్స్, సాంకేతిక విలువలు, హీరో-విలన్ పాత్రలు సినిమాపై అంచనాలను పెంచాయి. గతంలో ‘కుమారి 21ఎఫ్’, ‘విరూపాక్ష’ చిత్రాల విషయంలో ఆసక్తి చూపినట్లుగానే, ‘వృషకర్మ’ కథ కూడా సుకుమార్‌కు నచ్చినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సినిమా స్క్రీన్‌ప్లేతో పాటు మేకింగ్, ఎడిటింగ్, ట్రైలర్ కట్‌లోనూ సుకుమార్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆయన పర్యవేక్షణ, మార్గదర్శకత్వం సినిమా నాణ్యతకు తోడ్పడ్డాయనే చర్చ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ట్రైలర్ విడుదల తర్వాత ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి నాగచైతన్య కెరీర్లో కీలక చిత్రంగా నిలుస్తుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సినిమా ఫలితం విడుదల తర్వాతే తేలనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!