
సినిమాలు

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మక చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్, ప్రముఖ నిర్మాత బన్నీ వాసు కలిసి మరో కొత్త ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో ప్రియదర్శి హీరోగా నటించనుండగా, ప్రముఖ ఫోక్ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్‌గా కనిపించనుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో కూడిన ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌కు సుకుమార్ తన ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే సుకుమార్, విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా పేరొందిన బన్నీ వాసు కలిసి వస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించనుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను చిత్రబృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!