10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘భామనే సత్యభామనే’..

Writer: Chandrika 03:28 PM, 10 నవంబర్, 2026
30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘భామనే సత్యభామనే’..

ప్రయోగాత్మక పాత్రలతో ప్రేక్షకులను అలరించే నటుడు కమల్‌హాసన్ కెరీర్‌లో ‘భామనే సత్యభామనే’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. తమిళంలో ‘అవ్వై షణ్ముగి’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా 1996లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. కేఎస్‌ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మదన్‌ (కమల్‌హాసన్‌), జానకి (మీనా) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే, కూతురు పుట్టిన తర్వాత కొన్ని కారణాలతో విడిపోతారు. కోర్టు తీర్పు ప్రకారం కూతురిని వారానికి ఒక్కసారి మాత్రమే కలుసుకునే అవకాశం రావడంతో మదన్‌ తీవ్రంగా బాధపడతాడు. బిడ్డకు దూరంగా ఉండలేక, మధ్యవయస్కురాలైన మహిళ ‘శ్రీమతి భామ’గా వేషం మార్చుకుని మాజీ మామగారి ఇంట్లో ఆయాగా చేరతాడు. ఆ తర్వాత భామ వేషంలో మదన్‌ ఎదుర్కొనే హాస్యభరితమైన సంఘటనలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది.

ఈ సినిమాకు కమల్‌హాసన్ నటన ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా భామ పాత్రలో ఆయన నడక, మాటతీరు, హావభావాలు, శరీర భాషను సహజంగా చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్రేజీ మోహన్‌ సంభాషణలు, కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం సినిమాకు మరింత బలాన్నిచ్చాయి. జెమినీ గణేశన్‌, మీనా, నాజర్‌, మణివణ్ణన్‌ తమ పాత్రలతో అలరించారు. కమల్‌హాసన్‌ ప్రొస్థటిక్ మేకప్ కోసం హాలీవుడ్ మేకప్ నిపుణుడు మైఖేల్ వెస్ట్‌మోర్ సూచనలు అందించారు. ఈ మేకప్‌ వేయడానికి దాదాపు ఐదు గంటల సమయం పట్టేదని సమాచారం. దేవా స్వరపరిచిన పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్రాన్ని హిందీలో ‘చాచా 420’ పేరుతో రీమేక్ చేయగా, కమల్‌హాసన్‌ స్వయంగా దర్శకత్వం వహించారు. ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌, ఉత్తమ బాలనటి విభాగాల్లో తమిళనాడు రాష్ట్ర అవార్డులు అందుకున్న ఈ చిత్రం థియేటర్లలో సుదీర్ఘ ప్రదర్శనను నమోదు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కష్టాల్లో ఉన్నవారిని ఎగతాళి చేయొద్దు.. రేణు దేశాయ్ భావోద్వేగ సందేశం

కష్టాల్లో ఉన్నవారిని ఎగతాళి చేయొద్దు.. రేణు దేశాయ్ భావోద్వేగ సందేశం

వ్యాపారంలో వైఫల్యాలే ఎక్కువ పాఠాలు నేర్పించాయి - సమంత

వ్యాపారంలో వైఫల్యాలే ఎక్కువ పాఠాలు నేర్పించాయి - సమంత

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల తేదీ ఖరారు

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల తేదీ ఖరారు

సోషల్ మీడియా రివ్యూవర్లపై తరుణ్ భాస్కర్ ఫైర్

సోషల్ మీడియా రివ్యూవర్లపై తరుణ్ భాస్కర్ ఫైర్

‘RX’తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన రెజీనా కసాండ్రా

‘RX’తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన రెజీనా కసాండ్రా

RC-17లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన రిషికాంత్

RC-17లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన రిషికాంత్

ట్యాగ్లు
కమల్‌హాసన్భామనే సత్యభామనేఅవ్వై షణ్ముగికేఎస్‌ రవికుమార్తమిళ సినిమాతెలుగు సినిమాభారతీయ సినిమాచాచా 420క్రేజీ మోహన్దేవా సంగీతం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కష్టాల్లో ఉన్నవారిని ఎగతాళి చేయొద్దు.. రేణు దేశాయ్ భావోద్వేగ సందేశం
సినిమాలు

కష్టాల్లో ఉన్నవారిని ఎగతాళి చేయొద్దు.. రేణు దేశాయ్ భావోద్వేగ సందేశం

సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి
రాజకీయాలు

సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి

తన జీవితంలో చీకటి రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
జనరల్

తన జీవితంలో చీకటి రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘భామనే సత్యభామనే’..
సినిమాలు

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘భామనే సత్యభామనే’..

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డు
జనరల్

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డు

ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..
రాజకీయాలు

ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన

వ్యాపారంలో వైఫల్యాలే ఎక్కువ పాఠాలు నేర్పించాయి - సమంత
సినిమాలు

వ్యాపారంలో వైఫల్యాలే ఎక్కువ పాఠాలు నేర్పించాయి - సమంత

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు మంత్రుల అభినందనలు
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు మంత్రుల అభినందనలు

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల తేదీ ఖరారు

మాదాపూర్‌ తమ్మిడికుంట చెరువుకు హైడ్రా చర్యలతో కొత్త రూపు
జనరల్

మాదాపూర్‌ తమ్మిడికుంట చెరువుకు హైడ్రా చర్యలతో కొత్త రూపు

రైతులకు అండగా నిలవాలని బ్యాంకులకు భట్టి విక్రమార్క సూచన
జనరల్

రైతులకు అండగా నిలవాలని బ్యాంకులకు భట్టి విక్రమార్క సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!