
సినిమాలు

ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు అతడిని మరింతగా బాధపెట్టడం సరైన పద్ధతి కాదని రేణు దేశాయ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని విమర్శించడం, ఎగతాళి చేయడం అమానవీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఉంటారని.. వారి వ్యక్తిగత పరిస్థితులను, బాధలను గుర్తుంచుకోవాలని సూచించారు.
ఇతరుల జీవితాల్లోని లోపాలను ఎత్తిచూపే ముందు మన జీవితాల్లోనూ పరిపూర్ణత లేదనే విషయాన్ని గుర్తించాలని ఆమె అన్నారు. మనుషులుగా ఎదగాలంటే సానుభూతి, దయ, మానవత్వం ప్రాథమిక లక్షణాలని పేర్కొన్నారు. సమాజంగా మనం మరింత మెరుగ్గా ఆలోచించి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దయతో, వివేకంతో వ్యవహరించేందుకు తాను ఎలాంటి ప్రతిఫలమూ పొందలేదని, ఇవి తన వ్యక్తిగత నమ్మకాలేనని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!