10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలీవుడ్‌ ప్రముఖులకు ముంబై పోలీసుల హెచ్చరిక

Writer: Shivani K 03:54 PM, 10 నవంబర్, 2026
బాలీవుడ్‌ ప్రముఖులకు ముంబై పోలీసుల హెచ్చరిక

బాలీవుడ్‌ అగ్రతారల భద్రతపై ముంబై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గ్యాంగ్‌స్టర్ల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు అప్రమత్తంగా ఉండాలని కీలక సూచనలు జారీ చేశారు. జనసమూహాలకు, అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో అభిమానులతో సెల్ఫీలు దిగడం, ఎక్కువసేపు రద్దీ ప్రాంతాల్లో గడపడం వంటి చర్యలను నివారించాలని సూచించారు. టైగర్ ష్రాఫ్ నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటన తర్వాత పోలీసులు ఈ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రముఖులు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అభిమానులతో సమావేశాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు, టైగర్ ష్రాఫ్‌పై దాడికి ముందు పలువురు బాలీవుడ్ ప్రముఖుల ఇళ్ల వద్ద దుండగులు రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. సోషల్ మీడియా పోస్టులు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నటీనటుల కదలికలను గమనించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ప్రయాణించే వాహనాలు, భద్రతా ఏర్పాట్ల వివరాలను సైతం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ తదితరుల భద్రతను పోలీసులు సమీక్షిస్తున్నారు. సల్మాన్ నివాసం వద్ద ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయగా, అమితాబ్ బచ్చన్ తన నివాసం జల్సా వద్ద అభిమానులకు అభివాదం చేసే సమయంలో బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ వెనుక నిలబడుతున్నారు. అక్టోబర్ 18న ముంబైలోని జుహులో ఫుట్‌బాల్ ఆడి ఇంటికి తిరిగి వస్తున్న టైగర్ ష్రాఫ్ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. టైగర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనతో ప్రముఖుల భద్రతపై ఆందోళనలు పెరగడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలను మరింత పెంచారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉదిరంలో ధనుష్ పాత్రపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన దర్శకుడు

ఉదిరంలో ధనుష్ పాత్రపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన దర్శకుడు

కష్టాల్లో ఉన్నవారిని ఎగతాళి చేయొద్దు.. రేణు దేశాయ్ భావోద్వేగ సందేశం

కష్టాల్లో ఉన్నవారిని ఎగతాళి చేయొద్దు.. రేణు దేశాయ్ భావోద్వేగ సందేశం

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘భామనే సత్యభామనే’..

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘భామనే సత్యభామనే’..

వ్యాపారంలో వైఫల్యాలే ఎక్కువ పాఠాలు నేర్పించాయి - సమంత

వ్యాపారంలో వైఫల్యాలే ఎక్కువ పాఠాలు నేర్పించాయి - సమంత

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల తేదీ ఖరారు

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల తేదీ ఖరారు

సోషల్ మీడియా రివ్యూవర్లపై తరుణ్ భాస్కర్ ఫైర్

సోషల్ మీడియా రివ్యూవర్లపై తరుణ్ భాస్కర్ ఫైర్

ట్యాగ్లు
బాలీవుడ్ముంబై పోలీసులుటైగర్ ష్రాఫ్సల్మాన్ ఖాన్షారుక్ ఖాన్అమీర్ ఖాన్అమితాబ్ బచ్చన్సెలబ్రిటీల భద్రతగ్యాంగ్‌స్టర్ల బెదిరింపులుసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉదిరంలో ధనుష్ పాత్రపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన దర్శకుడు
సినిమాలు

ఉదిరంలో ధనుష్ పాత్రపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన దర్శకుడు

సిద్దిపేట వేదికగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం!
జనరల్

సిద్దిపేట వేదికగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం!

హైదరాబాద్ క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు..
జనరల్

హైదరాబాద్ క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు..

అయ్యప్ప భక్తులకు కీలక సూచనలు.. శబరిమల దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి
జనరల్

అయ్యప్ప భక్తులకు కీలక సూచనలు.. శబరిమల దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి

బాలీవుడ్‌ ప్రముఖులకు ముంబై పోలీసుల హెచ్చరిక
సినిమాలు

బాలీవుడ్‌ ప్రముఖులకు ముంబై పోలీసుల హెచ్చరిక

కష్టాల్లో ఉన్నవారిని ఎగతాళి చేయొద్దు.. రేణు దేశాయ్ భావోద్వేగ సందేశం
సినిమాలు

కష్టాల్లో ఉన్నవారిని ఎగతాళి చేయొద్దు.. రేణు దేశాయ్ భావోద్వేగ సందేశం

సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి
రాజకీయాలు

సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి

తన జీవితంలో చీకటి రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
జనరల్

తన జీవితంలో చీకటి రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘భామనే సత్యభామనే’..
సినిమాలు

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘భామనే సత్యభామనే’..

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డు
జనరల్

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డు

ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..
రాజకీయాలు

ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!