

ప్రేక్షకులను నవ్వించడం ఈ సోషల్ మీడియా యుగంలో మరింత కష్టమైందని నటుడు పేర్కొన్నారు. ఫన్నీ రీల్స్, మీమ్స్ కారణంగా కామెడీ కంటెంట్ ప్రతిరోజూ అందుబాటులో ఉండటంతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం పెద్ద సవాలుగా మారిందని తెలిపారు. స్టాండప్ కమెడియన్లకు తనకు అపారమైన గౌరవం ఉందని, ఒంటరిగా ప్రేక్షకుల ముందు నిలబడి నవ్వించడం అత్యంత కష్టమైన పని అని అన్నారు.
తన వ్యక్తిగత జీవితాన్ని గుర్తుచేసుకుంటూ, తన తండ్రి కళ్లలో గర్వాన్ని చూడడమే తనకు నిజమైన స్టార్‌డమ్ అని చెప్పారు. తండ్రి తన సినిమాలను థియేటర్‌లో చూసి ఇతరులను కూడా తీసుకెళ్లేవారని గుర్తు చేసుకున్నారు. తండ్రి మరణం తర్వాత తల్లి తనకు బలంగా నిలిచిందని తెలిపారు. 35 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, మొదట డబ్బు కోసమే నటుడిగా వచ్చానని, తర్వాత వైవిధ్యమైన పాత్రల అవసరం తెలుసుకుని హేరా ఫేరీ, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్‌మ్యాన్ వంటి సినిమాలు చేశానని వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!