

అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటి పూజా హెగ్డే నేడు తన 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె నటిస్తున్న ‘శ్రీ శ్రీ’ చిత్రబృందం కూడా ప్రత్యేక పుట్టినరోజు పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో పూజా హెగ్డే సహజంగా, నిరాడంబరంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఆమె అందం, హుందాతనం కథకు మరింత అందాన్ని తీసుకొచ్చాయని చిత్రబృందం ప్రశంసించింది.
రవినేలకుడిటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీ శ్రీ’ చిత్రంలో పూజా హెగ్డే, దుల్కర్ సల్మాన్‌కు జోడీగా నటిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత 2026 డిసెంబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ప్రస్తుతం విడుదల తేదీలో మార్పు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!