

ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో కొత్త చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ న్యూయార్క్‌లోని ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుంచి గ్రాండ్‌గా విడుదలైంది. హీరో టామ్ హాలండ్ స్వయంగా ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించడంతో ఈ ఈవెంట్ గ్లోబల్ స్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫ్యాన్స్‌కు మరపురాని అనుభూతిని కలిగించిన ఈ లాంచ్ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ విజయానంతరం నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తన అస్తిత్వాన్ని ప్రపంచం నుంచి పూర్తిగా చెరిపేసుకుని ఒంటరిగా జీవిస్తున్న పీటర్ పార్కర్, న్యూయార్క్ నగరాన్ని రక్షించే ఫుల్ టైమ్ స్పైడర్ మ్యాన్‌గా కనిపించనున్నాడు. డెస్టిన్ డానియల్ క్రెటన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జెండయా, జాకబ్ బటలాన్, సాడీ సింక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూలై 31న పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!