

ప్రముఖ నటి దియా మీర్జా దీపావళిని కాలుష్య రహితంగా జరుపుకోవాలని ప్రచారం చేస్తూ ఓ వీడియోను విడుదల చేయడంతో వివాదం మొదలైంది. ఈ ప్రచారంపై పలువురు బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే ఆమె వైఖరిని ప్రశ్నించారు. దీపావళి సందర్భంగా పర్యావరణహిత పద్ధతులను పాటించాలని సూచిస్తున్న దియా మీర్జా.. ఈద్, మొహర్రం, బక్రీద్ వంటి పండుగల సమయంలోనూ ఇలాంటి సూచనలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
రంజాన్, బక్రీద్ పండుగల సమయంలోనూ పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించాలని రాణే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దియా మీర్జా వంటి వారు సనాతన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పలువురు బీజేపీ నేతలు కూడా ఆమెను హిందూ వ్యతిరేకి, ప్రభుత్వ వ్యతిరేకి అంటూ విమర్శించారు. ముంబై బీజేపీ అధ్యక్షుడు అమిత్ సతమ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తన కాలుష్య రహిత దీపావళి ప్రచారం నుంచి దియా వీడియోను తొలగించింది. ఈ ఘటనతో పర్యావరణ పరిరక్షణ, మతపరమైన పండుగలు, ప్రముఖుల సామాజిక బాధ్యతపై రాజకీయ చర్చ మొదలైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!