

తన వ్యక్తిత్వ, ప్రచార హక్కుల పరిరక్షణ కోసం నటి శ్రుతి హాసన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా కొన్ని వ్యాపార సంస్థలు, సోషల్ మీడియా వేదికలు, ఏఐ డీప్‌ఫేక్ క్రియేటర్లు తన పేరు, ఫొటోలు, రూపాన్ని వినియోగిస్తున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తన రూపాన్ని ఉపయోగించి మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర కంటెంట్ రూపొందిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పిటిషన్‌ను పరిశీలించిన బాంబే హైకోర్టు, హక్కుల ఉల్లంఘనపై వాణిజ్య దావా దాఖలు చేసేందుకు శ్రుతి హాసన్‌కు అనుమతి ఇచ్చింది. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, బుకింగ్ యాప్‌లలో కూడా తన పేరు, చిత్రాలను అనుమతి లేకుండా ప్రచారాల కోసం వినియోగిస్తున్నారని ఆమె ఆరోపించారు. గతంలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఇలాంటి న్యాయపరమైన రక్షణ పొందారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!