
సినిమాలు

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ విడుదల వాయిదా పడింది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్, పీరియడ్ బ్యాక్‌డ్రాప్, యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యున్నత స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన 30 రోజుల భారీ క్లైమాక్స్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. అయితే పీరియడ్ ప్రపంచాన్ని, యాక్షన్ ఎపిసోడ్స్‌ను, విజువల్ గ్రాండియర్‌ను మరింతగా ఎలివేట్ చేసేందుకు వీఎఫ్‌ఎక్స్ పనులకు అదనపు సమయం అవసరమవుతోంది. తుది అవుట్‌పుట్‌లో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే విడుదలను వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలిపింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!