

సినీ వర్గాల్లో ప్రస్తుతం ‘ధురంధర్ 2’ మరియు ‘టాక్సిక్’ సినిమాల రన్‌టైమ్‌లపై చర్చ జోరుగా సాగుతోంది. రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ మొదటి భాగం రన్‌టైమ్‌పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ‘ధురంధర్ 2’ రన్‌టైమ్ సుమారు 3 గంటల 44 నిమిషాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. కథకు విస్తృతమైన నేపథ్యం ఉండటంతో ఈ నిడివి అవసరమైందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.
ఇక యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా రన్‌టైమ్ కూడా సుమారు 3 గంటల 15 నిమిషాలుగా ఉండనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భారీ నిడివితో సీక్వెల్ అవసరం లేకపోవచ్చని అంటున్నారు. యాక్షన్, ఎమోషన్ మేళవించిన ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. మొత్తానికి, ఎక్కువ నిడివితో సినిమాలు తీసేందుకు దర్శకులు ధైర్యంగా ముందుకు వస్తున్నారనే చర్చ సినీ పరిశ్రమలో సాగుతోంది.












.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!