

కామెడీ స్టార్ సత్య తన కొత్త సినిమా జెట్ లీ పోస్టర్‌తో సోషల్ మీడియాలో దుమ్మురేపాడు. విమానం మీద కూర్చుని ఇచ్చిన వింత పోజ్ అందర్నీ ఆకట్టుకుంది. అయితే ప్రేక్షకులను ఇంకా ఆశ్చర్యపరిచింది పోస్టర్‌పై ఉన్న “నేను కామెడీకి దూరమవుతున్నా” అనే లైన్. ఎప్పుడూ తన టైమింగ్‌తో నవ్వులు పంచే సత్య ఇలా చెప్పడం ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. కానీ ఈ గందరగోళానికి కారణం ఒక్కరే — డైరెక్టర్ రితేష్ రానా. మత్తు వదలరా వంటి యూనిక్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్టైల్ తెచ్చుకున్న రితేష్ రానా ఈ మూవీకి దర్శకుడు.
అతని సినిమాల్లో కామెడీ లేకపోవడం అసంభవం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే ఆ లైన్ కూడా ప్రమోషనల్ ట్రిక్ అన్న భావన పెరిగింది. స్టైలిష్ యాక్షన్, క్రేజీ కామెడీ కలగలిపిన డిఫరెంట్ ఎంటర్టైనర్గా జెట్ లీ ఉంటుందని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ అండతో వస్తున్న ఈ మూవీపై బజ్ ఒక్కసారిగా బాగా పెరిగింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!