

సరస్వతి సినిమా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడంతో మేకర్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ నెల 6న థియేటర్స్‌లో విడుదలైన ఈ హై-కాన్సెప్ట్ థ్రిల్లర్, వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, ఆమె సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్లో రూపొందించబడింది. సినిమా ఘన విజయంతో రన్ అవుతుండటంతో మేకర్స్ థ్యాంక్ యూ మీట్ నిర్వహించి ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.
హీరోయిన్ & డైరెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ, సినిమా ప్రతి సీన్, డైలాగ్‌కి ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారని, క్లైమాక్స్ చూసి వారు సర్ప్రైజ్ అయ్యారని తెలిపారు. సినిమా విమెన్ సెంట్రిక్ మాత్రమే కాకుండా యాక్షన్, ఎమోషన్, లవ్ అంచనాలతో ఒక మంచి థ్రిల్లర్‌గా రూపొందిందని, ప్రతి ఒక్కరూ థియేటర్స్‌లో తప్పక చూడాలని కోరారు. ఆడియన్స్ ఇచ్చిన రివ్యూస్, ప్రేమకు ధన్యవాదాలు తెలియజేశారు.

నిచోలాయ్ సచ్దేవ్ సినిమా టఫ్ స్టోరీ కలిగిందని, ఇలాంటి కథ చెప్పడానికి ధైర్యం అవసరమని అన్నారు. పూజా శరత్ కుమార్ మాట్లాడుతూ, సరస్వతి చిన్న సినిమా అయినప్పటికీ స్ట్రాంగ్ సినిమాగా ప్రేక్షకుల మనసుల్ని కదిలించినందున థియేటర్స్‌లో తప్పక చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకుల ప్రోత్సాహంతో సినిమా వైరల్‌గా మారిందని, అందరికి థాంక్యూ తెలియజేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!