

మెగాస్టార్ చిరంజీవి వరుస భారీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ‘విశ్వంభర’ విడుదలకు ముందే, బాబీ కొల్లి దర్శకత్వంలో మరో భారీ చిత్రాన్ని లైన్‌లో పెట్టారు. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్‌పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ఘనంగా నిర్మిస్తోంది.
ఈ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో శరత్ కుమార్ విలన్‌గా నటిస్తుండగా, డాక్టర్ భద్రం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ వేగంగా కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్‌డేట్ రాలేదు. దీంతో మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్ విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!