

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కలిసి నటించనున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. హాసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 150 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ పూర్తి చేసి, అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా ముగించాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ క్రేజీ మల్టీస్టారర్ వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!