
సినిమాలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు పలువురు మంత్రులతో కలిసి దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించనున్నారు. రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులలో ఒకటైన దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఈ పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, భూసేకరణ పురోగతి, నిర్మాణ పనుల వేగంపై అధికారులతో అక్కడికక్కడే సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అవసరమైన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!