
సినిమాలు

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కలిసి హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో ఈ రెండు రోజుల యాత్రను నిర్వహిస్తున్నారు.
సుమారు 50 వేల మందికి పైగా సింగరేణి కార్మికులు, 30 వేలకుపైగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం. జూలై 13, 14 తేదీల్లో కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి, తాడిచర్ల, రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వివిధ ప్రాంతాల్లో కార్మికులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!