
జనరల్

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో రెండు వర్గాల మధ్య అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. పబ్‌లో ఇరు వర్గాలు హల్‌చల్ చేయడంతో కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పబ్ లోపలే కాకుండా పార్కింగ్ ఏరియాలోనూ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో హంగామా చేసిన వారిలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి సోదరుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణకు దారితీసిన కారణాలు, ఇందులో పాల్గొన్న ఇతర వ్యక్తుల వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!