
జనరల్

భారత్‌లో తయారవుతున్న ఏకే-203 రైఫిళ్ల కోసం ఐదేళ్ల పాటు బుల్లెట్లను(7.62-39ఎంఎం) సరఫరా చేయడానికి ‘అదానీ డిఫెన్స్’ సంస్థ ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేటు లిమిటెడ్(ఐఆర్‌ఆర్‌పీఎల్) సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ బుల్లెట్లను దేశీయంగా కాన్పూర్‌లోని అదానీ డిఫెన్స్ సంస్థలో ఉత్పత్తి చేసి సరఫరా చేయనున్నారు. ఏకే-203లను భారత్‌లో తయారు చేయాలని భారత్, రష్యా మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఐఆర్‌ఆర్‌పీఎల్‌ను 2019లో ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ జిల్లా కోర్వాలో తుపాకులను తయారు చేస్తున్నారు. ఇక్కడ 6.01లక్షల ఏకే-203 రైఫిళ్లను తయారు చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!