

విభిన్నమైన కథా కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రూపొందుతున్న తెలుగు చిత్రం ‘సందిగ్ధం’ విడుదలకు సిద్ధమవుతోంది. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పార్థసారధి కొమ్మోజు దర్శకత్వం వహించారు. తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించగా, నందన్ కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. జీవ కోచెర్ల, నవీన్ రాజ్ సంకరపు, చిట్టిబాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగి, దుర్గ, శ్రీదేవి, లక్ష్మణ్ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!