

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, త్వరలో ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ ప్రారంభం కాకముందే సోషల్ మీడియాలో ‘స్పిరిట్’లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉంటారని, ఆయన ప్రభాస్ తండ్రిగా కనిపిస్తారని అనేక గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా జిగ్రీస్ టీమ్ ఇంటర్వ్యూలో సందీప్ వంగా ఈ రూమర్స్‌ను పూర్తిగా ఖండించాడు.
అయితే ఈ సందర్భంలో ఆయన చెప్పిన ఒక మాట మెగా అభిమానులను ఆనందపరిచింది. చిరంజీవిని తన కెమెరా లెన్సులో చూడాలని చాలా ఇష్టమని, ప్రత్యేకంగా ఒక మూవీ కోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తానని సందీప్ వంగ వెల్లడించాడు. ఆయన కార్యాలయంలో ‘ఆరాధన’ సినిమాలో చిరంజీవి చేసిన పులిరాజు లుక్‌ను ఫోటోగా ఉంచుకున్న సంగతి తెలిసిందే. ఇది ఆయనకు ఉన్న అభిమానాన్ని చూపిస్తుంది. ఒక సమయంలో ‘మాస్టర్’ సినిమాలో చిరంజీవి వేసుకున్న చొక్కా రంగులు, ఎక్స్ప్రెషన్లను కూడా డీటెయిల్‌గా చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
చిరంజీవి విషయానికి వస్తే, ‘విశ్వంభర’ విడుదల తర్వాత బాబీ దర్శకత్వ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. దాని తరువాత శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించే యాక్షన్ డ్రామా ఉంటుంది. ఈ ప్రణాళికలు పూర్తయ్యే సమయానికి 2027 వచ్చేస్తుంది. అప్పటికీ సందీప్ వంగ ‘స్పిరిట్’ పూర్తి చేసి ఉంటే, చిరంజీవితో కలసి సినిమా చేసే అవకాశం తప్పకుండా ఉంటుంది. లేకపోతే ఆయన పెండింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ లేదా మహేష్ బాబు ప్రాజెక్ట్‌లోకి వెళ్లవచ్చు. ఇప్పటి వరకు అధికారికంగా ఏదీ నిర్ధారించకపోయినా, చిరంజీవి–సందీప్ వంగ కాంబినేషన్ వస్తుందనే ఆశ మాత్రం మెగా అభిమానుల్లో బలంగానే ఉంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!