

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ రాజకీయాల్లోకి ఎందుకు రారనే ప్రశ్నకు ఆయన గతంలో ఇచ్చిన సరదా సమాధానం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్న సమయంలో ఎన్నికల్లో పోటీ చేయాలని తనకు అనిపిస్తుందని, కానీ తన సొంత భవనం సెక్రటరీ పదవికి పోటీ చేసినా గెలవలేనని సల్మాన్ చమత్కరించారు. తమ ఇంట్లో నుంచే తనకు మూడు ఓట్లు కూడా రావని చెప్పి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మాతృభూమి’ చిత్రంలో 16వ బిహార్ రెజిమెంట్‌కు చెందిన కల్నల్ సంతోష్ బాబు పాత్రలో నటిస్తున్నారు. 2020 గల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!