

మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన పాత్రల్లో ఒకటైన కర్ణుడి పాత్ర మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు తమిళ స్టార్ సూర్యతో రూపొందాల్సిన ఈ భారీ పౌరాణిక ప్రాజెక్ట్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వద్దకు చేరిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ఎన్నో సంవత్సరాలుగా ఈ కథను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్ సమస్యలు, ప్రణాళికల్లో మార్పులు కారణంగా సినిమా మధ్యలోనే నిలిచిపోయింది. ఇప్పుడు అదే కథను కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ నిర్మాణంలో ఓ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణుడి కథను సల్మాన్ ఖాన్‌తో తెరకెక్కించే అవకాశాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సల్మాన్ కూడా కథపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయినప్పటికీ ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఇటీవల పౌరాణిక కథలపై ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుంటే, కర్ణుడి పాత్రలో సల్మాన్ కనిపిస్తే అది బాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!