

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌కు కింగ్ నాగార్జున అక్కినేని మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు నిర్వాహకులు కంటెస్టెంట్ల ఎంపికపై దృష్టి సారించారు. ప్రముఖులతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ల పేర్లు ప్రచారంలో ఉండగా, తాజాగా జబర్దస్త్ నటుడు రామ్ ప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది.
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ ప్రసాద్ తన ప్రత్యేకమైన హాస్య టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బుల్లితెరతో పాటు సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా వినిపిస్తున్న ప్రచారం ప్రకారం బిగ్‌బాస్ నిర్వాహకులు రామ్ ప్రసాద్‌ను సంప్రదించారని, కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆయన బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెడితే వినోదం మరింత పెరిగే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆయన ప్రవేశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!